హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని బోలానగర్‌లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం రెండో అంతస్తులో షేక్ జైనుద్దీన్ సెంట్రింగ్ పనులు చేస్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడే క్రమంలో విద్యుత్ తీగలపై పడ్డాడు. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు కార్మికులు అమీర్, సలాఉద్దీన్‌లు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైనుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అమీర్, సలాఉద్దీన్‌ల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంలో పొలంలోనే రైతు మృతి