అవును వాళ్లు చేసింది తప్పే. బంగారు నగల తయారీలో నాణ్యత పాటించకపోవడం ముమ్మారు వారి తప్పే. కానీ వారిని దండించే హక్కు మాత్రం ఆ దుర్మార్గులకు లేదు. పోలీసులకు అప్పజెప్పిన బాగుండేదేమో. కానీ మనుషులు అనే మాటను మర్చి... మానవత్వాన్ని పక్కకు పెట్టి.. విచక్షణను కోల్పోయి ఇద్దరిని దండించిన తీరు మాత్రం అస్సలు మంచిది కాదు. పోని ఈ ఘటన జరిగింది ఎక్కడైనా మారుమూలన అంటే.. అదీ కాదు. హైదరాబాద్‌లో ఈ అమానుష ఘటన జరిగింది.
హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చెలపురా ప్రాంతంలో కొందరు బెంగాలీలు ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. వీరికి ఇద్దరు తయారీదారులకు.. కొందరు వచ్చి బంగారు ఆభరణాలు చేయాలంటూ సూచించారు. నగల తయారీలో నాణ్యత పాటించకుండా... నమ్మక ద్రోహం చేశారని గోల్ట్స్మిత్లపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా... చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు.
సిలిండర్‌కు కట్టి..
ఇద్దరిని సిలిండర్‌కు కట్టేశారు. అనంతరం విచక్షణ మరచి రెచ్చిపోయారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితులు వదిలేయమని ప్రాధేయపడినా సరే నిందితులు వినలేదు. ఒకరి తరువాత ఒకరు ముకుమ్మడిగా దాడిచేశారు. ఒంటిపై వాతలు వచ్చేలా కర్కషంగా కొట్టారు. చుట్టు ఉన్నవారు కనీసం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: బంగారంపై అప్పు X పర్సనల్ లోన్.. ఏది బెటర్?