పెళ్లి పనుల హడావుడితో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న పెళ్లి కుమారుడు మహ్మద్ సలీం (26) ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
సంజయ్ నగర్‌లోని మహ్మద్ ఖాజాకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు సలీంకు పెళ్లి చేయాలనుకున్నాడు. కొడుకు ఆటో డ్రైవర్ అయినా.. మంచి ఉన్నత చదువు చదువుకున్న అమ్మాయిని కొడలిగా ఎన్నుకున్నాడు. పెళ్లి ముహూర్తానికి మరి కొన్ని గంటలే ఉంది. ఓ వైపు పెళ్లి తంతు జరుగుతుండగానే.. కుమారుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెళ్లి పనుల్లో ఉన్న కుటుంబసభ్యులు తెల్లవారుజామున వరుడి గదికి వెళ్లగా.. స్పందించకపోవడంతో తలుపులను పగులగొట్టారు. అప్పటికే సలీంలో చలనం లేకపోవటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. వరుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ఉపాధ్యాయుడిని దొంగగా మార్చిన జల్సాలు..!