ETV Bharat / crime

ప్రియురాలు తనపై కేసు పెట్టిందని ప్రియుడు ఆత్మహత్య - తెనాలి లేటెస్ట్​ అప్​డేట్​

Girlfriend compliant: తనను ప్రేమించి మోసం చేశాడని ఓ ప్రియురాలు పోలీస్​స్టేషన్​ మెట్లు ఎక్కింది... తాను ఐదు నెలల గర్భవతినని న్యాయం చేయాలని కోరింది ఆ యువతి... కాదుకాదు తనే నన్ను వేధించిందని... నాతో ఉంటానని చెప్పి ఇప్పుడు పోలీస్​ కేసు పెట్టిందని సెల్ఫీ వీడియో తీశాడు ప్రియుడు. ఈ అవమానం భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి పురుగుల మందు తాగాడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే...

Girlfriend compliant
ప్రియురాలు తనపై కేసు పెట్టిందని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 26, 2022, 3:08 PM IST

Updated : Mar 2, 2022, 1:32 PM IST

Girlfriend compliant: ప్రేమ పేరుతో మోసాలు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ బాధను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకుని మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు. తాజాగా ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే... తానే నన్ను మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు. ఇంతకీ విషయం ఏమిటంటే...

పెళ్లైన విషయాన్ని దాచి...

Girlfriend compliant: వైకుంఠ‌పురం స‌మీప ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి తెనాలిలోని ఓ బ‌ట్ట‌ల షాపులో ప‌ని చేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి... చిన‌రావూరుకు చెందిన నంబూరి భవానీ ప్ర‌సాద్‌... కారు డ్రైవ‌ర్​గా పని చేస్తున్నాడు. వీరిద్దరికి రెండేళ్లక్రితం ప‌రిచ‌య‌మైంది. ప్ర‌సాద్​కు పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని యువ‌తి ద‌గ్గ‌ర దాచి ఆమెతో స‌హ‌జీవ‌నం చేశాడు. కొంత కాలంగా ఆమెను దూరం పెట్టాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాక‌రించడంతో యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తినని... త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరింది. గ‌తంలో గర్భం దాల్చిన తనకు బ‌ల‌వంతంగా గర్భస్రావం చేయించాడ‌ని బాధితురాలు ఆరోపించింది. త‌న‌ను మోసం చేసిన భవానీప్ర‌సాద్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొంది.

సెల్ఫీ వీడియో తీసి... ఆత్మహత్య

Girlfriend compliant: యువతి తనపై ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న భవానీప్రసాద్ ఫిబ్రవరి 25న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో ద్వారా చిత్రీకరించాడు. వాస్తవంగా ఆమె వల్లే అనేక ఇబ్బందులు వచ్చాయని, ఇతరులపై కూడా పలుమార్లు కేసులు పెట్టినట్లు ఆ వీడియోలో తెలిపాడు. ప్రసాద్​ తనకు కావాలని అతడి ఇంటికి వెళ్లి చేతులు కోసుకున్నట్లు చెప్పాడు. తనతో కలిసి ఉంటానని చెప్పి.. తనపై కేసు నమోదు చేయడాన్ని అవమానంగా భావిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో స్పష్టం చేశాడు. తాను చనిపోయినా తమకు న్యాయం చేయాలని కోరాడు. ఆ వీడియోను ఇతరులకు షేర్ చేయాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Mar 2, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.