ETV Bharat / crime

'ఈ కిరాతకుడి చేష్టలు వింటే గగుర్బాటు తప్పదు' - తెలంగాణ వార్తలు

అసహజ శృంగార కోరికలు నియంత్రణ చేసుకోలేని యువకుడు.. అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేశాడు. గాడితప్పిన యవ్వనం.. తల్లిదండ్రులు గాలికొదిలేయటంతో తప్పుమీద తప్పులు చేశాడు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు మృగంలా మారి ప్రాణాలు తీశాడు. గుంటూరు జిల్లాలో ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా హత్య చేసిన గోపి అనే యువకుడు.. భయంతో పోలీసులకు లొంగిపోయాడు.

boy-murdered-after-rape-attempt-in-mallempoodi-guntur-district in andhra pradesh
మల్లెంపూడి బాలుడి హత్య.. అసహజ శృంగార వికృత చేష్టలే కారణం!
author img

By

Published : Mar 20, 2021, 10:03 AM IST

మల్లెంపూడి బాలుడి హత్య.. అసహజ శృంగార వికృత చేష్టలే కారణం!

వెర్రిచూపులు చూస్తూ.. అమాయకుడిలా కనిపించేలా ఫొటోలు దిగే ఈ యువకుడు.. అత్యంత కిరాతకంగా రెండు హత్యలు చేశాడంటే గ్రామస్థులే నమ్మలేకపోయారు. ఆ హత్యలకు అసహజ శృంగార వికృత చేష్టలే కారణమని తెలిసి పోలీసులే విస్తుపోయారు. ఈ నెల 14న అదృశ్యమై విగతజీవిగా కనిపించిన బాలుని హత్య కేసులో అరెస్టయిన గోపి జీవితంలో ఒళ్లుగగుర్పొడిచే చీకటికోణాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాలుడు.. ఈ నెల 14న అదృశ్యమయ్యాడు. అదే రోజు సాయంత్రం ముళ్లపొదల వద్ద శవమై కనిపించాడు. శరీరంపై గాయాలు, విరిగిన కాళ్లు, చేతులు చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించారు. ఘటనా స్థలంతో పాటు గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆధారాల కోసం అన్వేషించారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన గోపి.. బాలుడిని తానే హత్య చేసినట్లు వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. బాలుడిని కిడ్నాప్‌ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసహజ శృంగారం జరిపాడని.. బయటకు చెప్పేస్తాడనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

వడ్డేశ్వరంలో అపహరణ, హత్యకు గురైన మరో బాలుడి హత్య వివరాలనూ విచారణలో గోపి వెల్లడించారు. గత నెల 11న తప్పిపోయిన బాలుడినీ హత్య చేసి తానే కాలువలో పడేసినట్లు తెలిపాడు. ఆ బాలుని మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా బాలుని హత్య కేసులో దర్యాప్తు కోసం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు గోపి తమ వెంటే ఉండి ఏమీ తెలియనివాడిలా ప్రవర్తించాడని ఎస్పీ తెలిపారు. తన స్నేహితులకూ ఓ పిల్లాడు కనిపించటం లేదని చెప్పాడు. వడ్డేశ్వరం బాలుని తండ్రిని గుర్తించి.. “అంకుల్‌! మీ పిల్లాడు తప్పిపోయాడు కదా? కనిపించాడా? “ అని అమాయకంగా అడిగాడు. దొరికిపోతాననే భయంతోనే పోలీసులకు లొంగిపోయాడు.

ఇదీ చదవండి: పురుగుల మందు తాగి కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.