కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని జాక్కల్ తండాలో విషాదం చోటుచేసుకుంది. బోడ చందర్, పద్మ వ్యవసాయ క్షేత్రానికి కుమారుడు మహేందర్ని (7) వెంటతీసుకుని వెళ్లారు. ఎప్పటిలాగే ఆడుకుంటూ ఒక్కడే ఇంటికి వెళ్లే సమయంలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతి చెందాడు.
బాలుడి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని బాలుని తల్లిదండ్రులు తెలిపారు.
ఇదీ చదవండి: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..