ETV Bharat / crime

విషాదం: తాతతో వెళ్దామనుకున్నాడు.. అనంతలోకాలకు చేరాడు..! - accident at rajarampally news

సెలవు దినం కదా అని సరదాగా తాతయ్యతో మేకలు మేపేందుకు వెళ్దామనుకున్నాడు. కానీ తుఫాన్​ వాహనం రూపంలో దారికాచిన మృత్యువు.. ఆ బాలుణ్ని ఈ లోకం నుంచే తీసుకెళ్లింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

boy died in a accident at rajarampally in jagtial district
విషాదం: రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ.. బాలుడి మృతి
author img

By

Published : Feb 28, 2021, 4:42 PM IST

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లెలో విషాదం చోటుచేసుకుంది. తుఫాన్​ వాహనం ఢీకొని దాసరి హరీశ్​ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆదివారం సెలవు దినం కావటం వల్ల హరీశ్​ తన తాతయ్యతో కలిసి మేకలు మేపడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మేకల కొట్టం వద్దకు వెళ్లాడు. ఎండలు బాగా కాస్తుండటం వల్ల ఇంటికి వెళ్లాలని తాతయ్య సూచించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన తుఫాన్​ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో హరీశ్​ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

అప్పటి వరకు తమ కళ్ల ముందు తిరుగుతూ ఉన్న కుమారుడు.. ఒక్కసారిగా విగతజీవిగా మారటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విషాదం: తాతతో వెళ్దామనుకున్నాడు.. అనంతలోకాలకు చేరాడు..!

ఇదీ చూడండి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. చితకబాదారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.