ETV Bharat / crime

హైదరాబాద్‌ శివారులో దారుణం... అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి - అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

అర్ధరాత్రి ఓ బాలిక తల్లితో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి రోడ్డు పక్కన మృతి చెంది కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి.. ఆత్మహత్యనా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

suspicious death
suspicious death: రోడ్డు పక్కన కాలిన బాలిక డెడ్​ బాడీ
author img

By

Published : Jun 19, 2021, 11:02 AM IST

Updated : Jun 19, 2021, 12:19 PM IST

హైదరాబాద్‌ శివారులో దారుణం... అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్‌లో దారుణం జరిగింది. బాహ్యవలయ రహదారి పక్కన ఓ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయపు నడకకు వెళ్లిన కొందరు వ్యక్తులు కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన స్రవంతిగా పోలీసులు గుర్తించారు.

బాలిక అర్ధరాత్రి వరకు ఇంట్లో ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఏడాదే పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. రాత్రి తల్లితో గొడవపడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. బాలికను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారా.. లేదంటే ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో యువతి ఫోన్ లభ్యమైనట్లు ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు తెలిపారు. ఆ బాలిక ఫోన్​ ద్వారా వివరాలు సేకరించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ... నలుగురు దుర్మరణం

Last Updated : Jun 19, 2021, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.