మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్ర వాహనం చిన్నారిని ఢీకొంది. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
ముగ్గురు పిల్లలను తీసుకొని ఓ తల్లి వెళ్తుండగా ముగ్గురు యువకులు ఉన్న ద్విచక్రవాహనం అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న బాలికను ఢీ కొట్టి... ఆపకుండా ముగ్గురు యువకులు పరారయ్యారు. ఆ వాహనానికి ముందు వైపు నంబర్ ప్లేట్ లేదని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అమెరికాలో మోసం.. కళ్లుకప్పి.. కారేపల్లికి!