ETV Bharat / crime

పదిరోజుల క్రితం హైదరాబాద్​లో అదృశ్యం.. ఖమ్మంలో శవమై.! - missing cases in telangana

Missing case chased: పది రోజుల క్రితం ఎల్బీనగర్​లో అదృశ్యమైన ఎమ్మార్పీఎస్​ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భానుచందర్​.. ఖమ్మంలో శవమై తేలాడు. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా భానుచందర్​కు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.

bhanu chander misses and died
భానుచందర్​ అదృశ్యం మృతి
author img

By

Published : Apr 25, 2022, 9:00 PM IST

Updated : Apr 25, 2022, 10:29 PM IST

Missing case chased: హైదరాబాద్​ ఎల్బీనగర్​లో ఈ నెల 16 వ తేదీన అదృశ్యమైన తెలంగాణ ఎమ్మార్పీఎస్​ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భానుచందర్ కథ విషాదాంతమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్​ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా..​ ఖమ్మంలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిపోవడంతో చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా ఆ వ్యక్తి అదృశ్యమైన భానుచందర్​గా పోలీసులు గుర్తించారు. గత 9 రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీసులకు భానుచందర్​ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

bhanu chander misses and died
అదృశ్యమైన భానుచందర్ ఫోటో చూపిస్తున్న కుటుంబీకులు

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాయినగర్​లో ఉన్న పేదలకు గుడిసె స్థలాల పట్టాల కోసం భానుచందర్​ నిత్యం పోరాడేవాడని మృతుడి కుటుంబీకులు తెలిపారు. ఆ స్థలంలో అంబేడ్కర్​ జయంతి ఉత్సవాలను నిర్వహించిన మరునాడే ఈ సంఘటన జరిగిందని చెప్పారు. దీంతో ఆ స్థలంలో నివసించే పలువురు వ్యక్తులపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు హత్య కోణంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా భానుచందర్​కి కావ్య అనే యువతితో రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.

పదిరోజుల క్రితం హైదరాబాద్​లో అదృశ్యం.. ఖమ్మంలో శవమై.!

ఇవీ చదవండి: Attack With Knife: పెళ్లికి ఒప్పుకోలేదని.. కల్లు గీసే కత్తితో యువతిపై దాడి

సమోసా తిన్నాడని హత్య.. ఫోన్​ కోసం అన్నాచెల్లెళ్ల గొడవ.. మహిళ బలి

Last Updated : Apr 25, 2022, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.