భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తున్న బెల్టు దుకాణాల నుంచి పోలీసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల్లో భాగంగానే సుమారు 50 వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు వివరించారు. కరోనా కట్టడి కోసమే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని.. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని.. ఒకవేళ వచ్చినా మాస్కుధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ