ETV Bharat / crime

'నన్ను పెళ్లి చేసుకో.. దయ్యాన్ని వదిలిస్తా' - fake baba cheated a women

Baba who cheated the young woman in HYD: భక్తుల విశ్వాసాలను మూటకట్టుకుని బాబా అవతారమెత్తాడు. దర్గాకు వచ్చే అమాయక భక్తులను బుట్టలో వేసుకుని మాయమాటలు చెబుతూ మళ్లీమళ్లీ వచ్చేలా చూసుకుంటాడు. ఆర్థిక స్తోమత, ముందు వెనక ఎవరూలేని వారిని గుర్తించి వలలో వేసుకుంటాడు. ఎవరైనా కాదంటే తన పలుకుబడితో భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఓ యువతికి దయ్యం పట్టిందని.. అది వదలాలంటే తనను పెళ్లి చేసుకోవాలంటూ భయపెట్టిన ఘటనతో దొంగ బాబా అసలు స్వరూపం బట్టబయలైంది.

The accused is Nakshabandhi Hafiz Pasha
నిందితుడు నక్షాబంధీ హఫీజ్‌ పాషా
author img

By

Published : Feb 13, 2023, 12:57 PM IST

Updated : Feb 13, 2023, 2:30 PM IST

Baba who cheated the young woman in HYD: యువతికి దయ్యం పట్టిందని.. అది వదలాలంటే తనను పెళ్లి చేసుకోవాలంటూ భయపెట్టిన ఓ దర్గా ఇన్‌ఛార్జి అసలు స్వరూపం రట్టయింది. ఏపీలోని నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట రహ్మతుల్లా దర్గా ఇన్‌ఛార్జి షా గులాం నక్షాబంధీ హఫీజ్‌ పాషా(55)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలున్నారు. దయ్యాలు, భూతాలు వదిలిస్తానంటూ పూజలు చేస్తుంటాడు. కొద్దికాలం క్రితం మకాం హైదరాబాద్‌కు మార్చాడు. నెలలో 4-5 రోజులు ఏఎస్‌పేటలోని దర్గాకు వెళ్తుంటాడు. టోలిచౌకికి చెందిన యువతి (19) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.

ఆ యువతిని కుటుంబ సభ్యులు రహమతుల్లా దర్గాకు తీసుకెళ్లారు. యువతికి దయ్యం పట్టిందంటూ పాషా భయపెట్టాడు. అది ప్రాణాలు తీసేవరకు వదలదని, చావు నుంచి తప్పించుకోవాలంటే తనకిచ్చి వివాహం చేయాలని తేల్చి చెప్పాడు. వేరే దారిలేక యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకొన్నారు. అతడి ఆదేశాలతో శనివారం రాత్రి టోలిచౌకిలోని ఒక ఫంక్షన్‌ హాలులో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

మండపానికి వస్తుండగా అతడికి గుండెలో ఇబ్బందిగా అనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అతనికి అప్పటికే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో ఆదివారం యువతితో కలిసి కుటుంబ సభ్యులు లంగర్‌హౌస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని తప్పించేందుకు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.

నిందితుడిపై పలు కేసులు?: నకిలీ బాబాగా అవతారమెత్తిన హఫీజ్‌పాషా 2012లో తమిళనాడుకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానంటూ లోబర్చుకున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై కక్షగట్టిన హఫీజ్‌పాషా అనుచరులతో ఆమె ఇంట్లో గంజాయి ప్యాకెట్లు పెట్టించాడు. ఇతడి బారిన పడిన మరో ఇద్దరు మహిళలు తాజాగా నెల్లూరు జిల్లా పోలీసులను ఆశ్రయించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 13, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.