మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్మెట్ క్రాస్‌రోడ్‌లోని ఏటీఎంలలో దొంగతనం చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పంజాబ్ నేషనల్, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి యత్నించారు. నగదు యంత్రాలు పాక్షికంగా ధ్వంసం చేశారు.
బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలలో డబ్బులు చోరీ జరగలేదని.. ఆకతాయిలు చేసినపని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
- ఇదీ చూడండి: బాసరలో వసంత పంచమి వేడుకలు