ETV Bharat / crime

ఫ్యాక్షన్ కలకలం.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Brutal Murder IN Kurnool District: ఏపీ కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి ముఖ్య అనుచరుడైన కున్నూరు సిద్దప్పను దుండగులు హత్య చేశారు. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

Brutal Murder IN Kurnool District
Brutal Murder IN Kurnool District
author img

By

Published : Oct 19, 2022, 2:15 PM IST

Brutal Murder IN Kurnool District: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరులో ఫ్యాక్షన్ కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి ముఖ్య అనుచరుడైన కున్నూరు సిద్దప్పను దుండగులు హత్య చేశారు. కోడుమూరులో తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా దుండగులు కాపుకాసి.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా మెడ, తలపై దాడి చేశారు. దీంతో సిద్ధప్ప అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న సిద్ధప్పను కుటుంబసభ్యులు, స్థానికులు అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధప్ప మృతి చెందాడు. 2008లో జరిగిన తెదేపా నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో సిద్ధప్ప ముద్దాయిగా ఉన్నాడు. పాత కక్షలే సిద్ధప్ప హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం.. కిరాతకంగా చంపి.. కృష్ణానదిలో పడేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.