ETV Bharat / crime

LIVE VIDEO: గొడ్డలి, బండరాళ్లతో దాడి.. పాత కక్షలే కారణం - జగిత్యాల వార్తలు

గోటితో పోయే వాటిని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లుంది ఈ ఘటన. కుర్చొని మాట్లాడుకుంటే అపార్థాలు తొలిగిపోయే సమస్యను... దాడి చేసుకునే వరకు తీసుకెళ్లిపోయారు. పొలంలో జరిగిన ఓ వివాదం గురించి మాట్లాడుకోకుండా... కొట్లాడుకోవడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

LIVE VIDEO
గొడ్డలి, బండరాళ్లతో దాడి
author img

By

Published : Aug 5, 2021, 12:41 PM IST

జగిత్యాల జిల్లా చెల్గల్​లో పొలం వివాదం కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి అతని కొడుకులు దాడి చేశారు.

గంగారెడ్డి తన పొలంలో వరినాట్లు వేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పొలంలో గడ్డి మందు కొట్టారు. దీంతో వరినారు ఎండిపోయింది. ఈ క్రమంలో మల్లేశమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావించి... గంగారెడ్డి కుటుంబసభ్యులు మల్లేశంపై దాడికి దిగారు. గొడవళ్లు, బండరాళ్లతో హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో మల్లేశం తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడిన మల్లేశాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడే ఉన్న స్థానికులు గొడవను ఆపేందుకు ప్రయత్నించకపోగా... సెల్​ఫోన్​లలో ఘటనా దృశ్యాలను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

గొడ్డలి, బండరాళ్లతో దాడి

ఇదీ చూడండి: THEFT: వాష్​రూంకు వెళ్లొచ్చేలోపు బ్యాగు చోరీ.. ఇక టవల్​తోనే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.