ETV Bharat / crime

ATTACK: కోదాడలో పోలీస్​ కానిస్టేబుళ్లపై దాడి.. అసలేం జరిగిందంటే..? - Attack on police constables news

సెలవులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ.. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులమంటూ బెదిరించారని స్థానికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

ATTACK: పోలీస్​ కానిస్టేబుళ్లపై దాడి.. అసలేం జరిగిందంటే..?

author img

By

Published : Sep 4, 2021, 7:03 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సెలవులో ఉన్న ఇద్దరు పోలీస్​ కానిస్టేబుళ్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. మద్యం సేవించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఏం జరిగిందంటే..

పట్టణంలోని ఓ మద్యం దుకాణం పక్కన రోడ్డుపై కారు నిలిపి.. సెలవులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం సేవిస్తున్నారు. నడిరోడ్డుపై మద్యం సేవించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తే.. తాము పోలీస్ కానిస్టేబుళ్లమని బెదిరించారు. ఈ క్రమంలోనే స్థానికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సైతం మద్యం సేవించి ఉన్న కానిస్టేబుళ్లకే మద్దతు తెలుపుతుండటంతో స్థానికులు వారితోనూ కాసేపు వాగ్వాదానికి దిగారు. చివరకు ఇరువర్గాలు శాంతించడంతో గొడవ సద్దుమణిగింది. ఘటనపై స్థానిక ప్రైవేట్ డాక్టర్ ఒకరు పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: Petrol attack: చిట్టి డబ్బులు అడిగినందుకు భార్యతో పెట్రోల్​ పోయించి అంటించాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.