ఏపీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అధికార పార్టీ కార్యకర్తలు తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. 6 ద్విచక్రవాహనాలు, ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంచించారు (attack on ex Zptc house Guntur).
ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడులకు పాల్పడిన వారి వివరాలపై ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
ఇదీ చూడండి: tdp national president chandrababu: 'ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి'