ATTACK ON ADVOCATE IN KOLLAPUR: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కోర్టు బయట ఓ ప్రైవేట్ కేసు ఫైల్ చేయడానికి వచ్చిన లాయర్ సంతోష్ కుమార్ నాయక్‌పై కొంతమంది దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనతో న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ కొల్లాపూర్ కోర్టు లాయర్లు విధులు బహిష్కరించారు. గేటు ముందు ఆందోళనకు దిగారు.
అసలేం జరిగిందంటే...
ATTACK ON ADVOCATE: చిన్నంబావి మండలానికి సంబంధించిన ఓ ప్రైవేట్ కేసును కొల్లాపూర్ కోర్టులో ఫైల్ చేసి వెళ్లుతున్న క్రమంలో కోర్టు బయట కేసుకు సంబంధించిన ప్రత్యర్థులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారని తోటి లాయర్లు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. సంతోష్ కుమార్ నాయక్ రంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్విర్తిస్తున్నారు.
'న్యాయం కోసం పోరాడే న్యాయవాదిపై దాడి చేయడం దారుణం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పార్లమెంటులో వెంటనే అమలు చేయాలి. చావుబతుకుల్లో ఉన్న లాయర్ సంతోష్ కుమార్ నాయక్‌కు భద్రత కల్పించాలి. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.'
-భుజాల భాస్కర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి:శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసు.. రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు