Atm vehicle driver arrest: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని సాయిబాబానగర్‌లో గల ఏటీఎంలో రైటర్స్ సంస్థ సిబ్బంది ఈ నెల 19న నగదు నింపుతుండగా... డ్రైవర్ సాగర్ ఏటీఎం వాహనంలో ఉన్న రూ.36 లక్షలతో పరారయ్యాడు.
![Atm vehicle driver arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-09-24-atm-vehicle-driver-arrest-av-ts10011_24022022101629_2402f_1645677989_1101.jpg)
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అతను చోరీ చేసిన వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి... నగదుతో వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకొన్నాడు. చోరీ చేసిన నగదులో కొంత డబ్బు పెట్టి ఖరీదైన చరవాణి కొన్నాడు. ఆదివారం తిరిగి హైదరాబాద్ చేరుకొని ఓ కారును రూ.8.6 లక్షలకు కొనుగోలు చేశాడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టిన దుండిగల్ పోలీసులు నిందితుడు కర్నూలులో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం దుండిగల్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.
![Atm vehicle driver arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-09-24-atm-vehicle-driver-arrest-av-ts10011_24022022101629_2402f_1645677989_277.jpg)
అసలు ఏం జరిగిందంటే...
ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే వాహనంతో పాటు రూ.36 లక్షల నగదుతో ఈ నెల 19న డ్రైవర్ పరారైన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాయిబాబానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో రైటర్ సంస్థకు చెందిన వాహనంలో సిబ్బంది వెళ్లారు. రూ.15 లక్షల నగదును యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నింపేందుకు క్యాషియర్ రంజిత్, గన్మెన్ రాంబాబు కిందకు దిగారు. ఈ క్రమంలోనే డ్రైవర్ సాగర్ వాహనాన్ని మలుపు కొస్తానని చెప్పి.. అందులో ఉన్న రూ.36 లక్షల నగదుతో పరారయ్యాడు.
ఇదీ చదవండి:Jeedimetla minor girl death case : ఆ బాలికది హత్యా, ఆత్మహత్యా.. ఆ మూడు గంటలు ఏమైంది?