సికింద్రాబాద్ నల్లబజారులో.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 ‘అంపోట్రేట్ బి’ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన నిఖిల్ రెడ్డి, స్రవంతి, వేణులు ముఠాగా ఏర్పడ్డారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అవసరం ఉన్న వారికి అధిక మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు విద్యార్థి కాగా మరో ఇద్దరు ఫార్మా మార్కెట్ ఏజెంట్లుగా ఉన్నారు. వీరు బోయిన్పల్లిలో అక్రమంగా అధిక ధరలకు ఇంజక్షన్లు అమ్ముతున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: JNTU: జులై 1 నుంచి ఇంజినీరింగ్ చివరి పరీక్షలు