ETV Bharat / crime

ACB Arrest DSP Jagan: అవినీతి ఆరోపణపై డీఎస్పీ జగన్​ను అరెస్టు చేసిన ఏసీబీ

ACB Arrest DSP Jagan: అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ జగన్‌ను అనిశా అధికారులు అరెస్టు చేసి ఆయన ఇంటి నుంచి తరలించారు. అతనికి సహకరించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది రామును కూడా అరెస్టు చేశారు.

ACB Arrest DSP Jagan
ACB Arrest DSP Jagan
author img

By

Published : Dec 15, 2021, 10:46 PM IST

ACB Arrest DSP Jagan : అవినీతి ఆరోపణలపై డీఎస్పీ జగన్​ను అనిశా అధికారులు అరెస్టు చేశారు. హెచ్‌ఎండీఏలోని విజిలెన్స్‌ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్​ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనం కూల్చకుండా ఉండేందుకు కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

లంచం కోసం డిమాండ్​

ఈ మొత్తానికి సంబంధించి ముందుగా 2 లక్షల రూపాయలు... రెండు నెలల క్రితం మరో 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. బదిలీ అయినప్పటికీ మిగితా లంచం డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు జగన్‌ నివాసంతో పాటు అతని కుటుంబసభ్యుల నివాసంలోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

డొంక కదులుతోంది..

స్థిరాస్తి వ్యాపారంలో జగన్‌... బోడుప్పల్‌, కొర్రమూల, జీడిమెట్ల ప్రాంతాల్లో పలువురితో కలిసి పెట్టుబడులు పెట్టినట్టు, బినామీ పేరుతో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. జగన్‌తో పాటు అతనికి సహకరించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది రామును కూడా అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ చూడండి: loan app case: మళ్లీ తెర మీదికి రుణ యాప్‌ల కేసు.. మరో రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.