రుణ యాప్‌ల కేసులో మరో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో చిన్నబ్బ రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరుకు చెందిన రాజశేఖర్ బెంగళూరులో ఉంటూ తొమ్మిది టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు సంచాలకుడిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ తొమ్మిది కంపెనీలు స్నాపిట్, ఓకే క్యాష్, మై బ్యాంక్, క్యాష్ బీ, రూపీ ఫ్యాక్టరీ, బబుల్ లోన్, గో క్యాష్తో పాటు పలు రుణ యాప్‌లతో ఒప్పందం కుదుర్చుకుని రుణాలు తీసుకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు చైనాకు చెందిన ల్యాంబోతో సహా 21 మందిని పోలీసులు ఈ వ్యవహారంలో అరెస్టు చేశారు. కంపెనీ ఖాతాల్లోని రూ.300 కోట్లను ఇప్పటి వరకు పోలీసులు స్తంబింపజేశారు.
ఇదీ చదవండి : పోలీసులకు చిక్కిన రుణయాప్‌ల ప్రధాన నిందితుడు