తెలుగు అకాడమీ ఫిక్సెడ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. షిర్డీలో తలదాచుకున్న మదన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తెలుగు అకాడమీకి చెందిన నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లను రూ.64.05 కోట్లు కాజేసిన సాయికుమార్ బృందంలో మదన్ కూడా ఒక సభ్యుడని పోలీసులు తెలిపారు. సాయికుమార్‌కు మూడేళ్ల క్రితం పరిచయమైన మదన్.. తెలుగు అకాడమీలో నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేద్దామని సాయికుమార్ ప్రతిపాదించినప్పుడు తానూ సహకరిస్తానని.. వాటా ఇవ్వాలంటూ కోరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకూ సాయి కుమార్, వెంకటరమణ, రాజశేఖర్ల సూచనల మేరకు ఫిక్స్డ్ డిపాజిట్ల నకిలీ రసీదులు, ఇతర పనులు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు. కెనరాబ్యాంక్ మాజీ మేనేజర్ సాధన భర్త బాబ్జీకి 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు. విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్‌పై ఇక్కడికి తరలించనున్నామని వివరించారు.
ఇదీ చూడండి: