నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని సావిత్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది.
గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఒంటరిగా ఉంటోంది. శుక్రవారం టీ పెట్టుకునేందుకని స్టౌవ్ వెలిగించింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేలోపే.. కూర్చుని ఉన్న వృద్ధురాలు కూర్చున్నట్లే మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు హైదరాబాద్లో ఉంటారని, ఆమె ఒంటరిగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి: చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..!