ETV Bharat / crime

ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన కారు.. వృద్ధుడు మృతి - తెలంగాణ వార్తలు

సూర్యాపేట జిల్లా ఫణిగిరి స్టేజి వద్ద ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

An old man dead in accident, car and auto accident
కారు, ఆటో ఢీ, ఫణిగిరి వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 5, 2021, 1:13 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి స్టేజి వద్ద ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా... పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తిరుమలగిరి నుంచి తుంగతుర్తి వైపు వెళ్తున్న ఆటో ప్రయాణికుల కోసం ఆగి ఉండగా... అదే సమయంలో సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

హన్మకొండకు చెందిన సురేందర్ రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి అతి వేగంతో కారు నడపడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ హోటల్ సామగ్రి ధ్వంసమైందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.