ETV Bharat / crime

అంబులెన్స్ చోరీ జరిగింది.. ఎక్కడో తెలుసా..? - Ambulance theft in Patancheru

Ambulance Theft: ఈ దొంగలు ఎవరో మామూలు వాళ్లు కాదు. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకున్నారు. ఏకంకా పార్కింగ్ చేసి ఉన్న అంబులెన్స్​ను చోరీ చేశారు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే.

Ambulance Theft in Sangareddy district
Ambulance Theft in Sangareddy district
author img

By

Published : Nov 23, 2022, 5:35 PM IST

Ambulance Theft: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రాంతీయ ఆసుపత్రి ముందు పార్క్ చేసిన అంబులెన్స్​ను గుర్తుతెలియని దుండగులు పట్టపగలే మాయంచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పటాన్​చెరుకు చెందిన సాయికుమార్ అంబులెన్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం అంబులెన్స్​ను ఆసుపత్రి ఎదుట ఉంచి భోజనానికి వెళ్ళాడు.

అంబులెన్స్ చోరీ జరిగింది.. ఎక్కడో తెలుసా..?

తిరిగి వచ్చి చూసేసరికి అంబులెన్స్ కనిపించలేదు. వాహనం కోసం చాలాచోట్ల వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పటాన్​చెరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించంగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: నేరస్థులతో దోస్తీ.. కానిస్టేబుల్ బన్ ​గయా గ్యాంగ్​స్టర్ ..!

ఆస్తి కోసం 72 ఏళ్ల భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.