Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టడంతో అందులోని హార్ట్ పేషెంట్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుకు గురైన వ్యక్తిని భద్రాచలం నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా లక్ష్మీపురం గ్రామంలో జామాయిల్ లోడుతో వెళుతున్న లారీ అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోగి దనిబాబు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:చేపల లారీ బోల్తా... అరగంటలో లోడు మాయం..