సిద్దిపేట శివారులో మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రమాదంలో హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలవ్వగా.. కారు భారీగా ధ్వంసమైంది.
అడవి పందుల గుంపు అడ్డు రావడంతో.. వాటిని తప్పించబోయి పైలట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. ఫలితంగా కాన్వాయ్‌లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనా స్థలి నుంచి మరో వాహనంలో మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. హరీశ్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇవీచూడండి: Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ