ETV Bharat / crime

GUMMADI NARSAIAH: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా - Former mla gummadi narsaiah accident news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడగా.. స్వల్ప గాయాలతో నర్సయ్య బయటపడ్డారు. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

GUMMADI NARSAIAH: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా

author img

By

Published : Aug 17, 2021, 3:25 PM IST

Updated : Aug 17, 2021, 8:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య కారు ప్రమాదానికి గురైంది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తుండగా.. టేకులపల్లి మండల పరిధిలో కారు బోల్తాపడింది. వెంటనే స్పందించిన న్యూడెమోక్రసీ నాయకులు ఆయనను కారు నుంచి బయటకు తీశారు.

ప్రమాదం అనంతరం మరో కారులో వెళ్లిన గుమ్మడి నర్సయ్య

గుమ్మడి నర్సయ్యకు కాలుతో పాటు పలుచోట్ల స్వల్ప గాయాలు కావడంతో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోడు భూముల సమస్యపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తదితరులు కలిసి ఇల్లందు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

5 సార్లు ఎమ్మెల్యేగా ఘనత..

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా సేవలందించిన ఘనత ఉంది. ఆయన ఇటీవల కరోనా బారినపడి వైరస్​ను జయించారు. మరోవైపు గుమ్మడి రాజకీయ నేపథ్యం విశేషాలతో ఆయన పేరుమీద సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. నాలుగో సారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత.. పార్టీ నుంచి మోటార్ బైక్, జీపు వచ్చాయి. అయినా తనకు సైకిల్​పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ దాన్నే ఉపయోగించేవారు. 63 ఏళ్ల వయస్సులోనూ ఆయన.. అప్పుడప్పుడు సైకిల్​పైనే షికారుకు వెళ్తుంటారు.

ఇదీ చూడండి: బాలుడిని చితకబాదిన ట్యూషన్‌ టీచర్‌... పోలీసులకు ఫిర్యాదు

Last Updated : Aug 17, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.