ETV Bharat / crime

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 8 మందికి గాయాలు

విశాఖ ఉక్కు కర్మాగారం
విశాఖ ఉక్కు కర్మాగారం
author img

By

Published : Feb 11, 2023, 2:05 PM IST

Updated : Feb 11, 2023, 2:56 PM IST

14:04 February 11

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. లాడిల్‌లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తొలుత స్టీల్‌ ప్లాంట్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆ ఘటన మరువక ముందే..: ఇటీవల కాకినాడ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బయ్య ఆయిల్‌ ప్యాకింగ్‌ మిల్లులో.. 24 అడుగుల ట్యాంక్‌ని శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ట్యాంక్‌ని శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపలికి దిగిన 10 నిమిషాల్లోలోపే ఆక్సిజన్‌ అందకపోవడంతో.. ఇద్దరూ నిచ్చెన ద్వారా పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరు లోపలే పడిపోయాడు. పైకి వచ్చిన కార్మికుడు లోపల చిక్కుకుపోయిన అతడిని కాపాడేందుకు సాయం కోరగా తోటి కార్మికులతో పాటు స్థానికులు ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు లోపలికి దిగారు. బయటున్న వారు ట్యాంక్‌కు రంధ్రం చేసి లోపల చిక్కుకున్న వారికి ఆక్సిజన్‌ అందించేందుకు యత్నించగా.. అప్పటికే ఏడుగురు ఊపిరాడక విగతజీవులుగా పడి ఉన్నారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. ట్యాంక్‌కు మరో రంధ్రం చేసి కార్మికుల మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా.. ఇద్దరిని పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో పాడేరుకు చెందిన వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, సాగర్, కె.బంజుబాబు, కుర్రా రామారావు.. పులిమేరుకు చెందిన కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్​లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు బోరున విలపించారు.

నైపుణ్యం లేని కార్మికులు, పర్యవేక్షణ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని కాకినాడ కలెక్టర్‌ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, పరిశ్రమ తరఫున రూ.25 లక్షల చొప్పున అందించనున్నారు.

ఇవీ చూడండి..

ఏడుగురిని బలిగొన్న ఆయిల్ ట్యాంక్.. చెప్పే మృత్యుగాథలు!

కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు.. కాలితో యువకుడి ఛాతిలో తన్ని..

Last Updated : Feb 11, 2023, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.