Delhi liquor scam Case: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అభిషేక్ బోయిన్‌పల్లికి సీబీఐ కస్టడీ ముగిసింది. ఈ నెల 10 నుంచి అభిషేక్ బోయిన్‌పల్లి సీబీఐ కస్టడీలో ఉన్నారు. మొత్తం 5 రోజుల పాటు అభిషేక్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో అభిషేక్‌ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో సైతం: ఇప్పటికే ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్ నాయర్ తర్వాత హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. అయితే అభిషేక్ బోయిన్‌పల్లిని ఎక్కడ అరెస్టు చేశారు.. అనే విషయాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ 15మందిని నిందితులుగా పేర్కొంటూ.. మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
అనంతరం పలు మార్లు దిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి వ్యక్తులను ప్రశ్నించింది. మరికొందరిని దిల్లీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.
ఇవీ చదవండి: దిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ అరెస్టు.. నెక్ట్స్ ఆ ప్రముఖులకే నోటీసులు!
Delhi liquor scam: అభిషేక్ బోయినపల్లికి 3రోజుల రిమాండ్.. ఇక నెక్ట్స్ వారే!
ఒంటరి మహిళలే టార్గెట్.. నకిలీ ఖాతాలతో బురిడీ.. ఇద్దరు ఆఫ్రికన్ల అరెస్ట్