హైదరాబాద్‌లో అపహరణకు గురైన మూడేళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్ర మాలేగావ్ తాలుకా అమన్‌వాడీలో బాలుడిని గుర్తించారు.
బాలుడిని అపహరించిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 10 రోజుల క్రితం హైదరాబాద్‌లో బాలుడిని నిందితుడు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని పట్టుకున్నారు.