Young man tried to Rape a girl: చిరునామా చెప్పాలని అడిగిన యువకుడిని ఓ బాలిక గుడ్డిగా నమ్మి.. ఆ ప్రాంతం ఎక్కడుందో చూపేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన బాలిక(11)ను శనివారం మధ్యాహ్నం బీఎన్‌ఆర్ నగర్‌కు చెందిన సాయికుమార్ (22) తహసీల్దార్ కార్యాలయం చిరునామా అడిగాడు.
అదెక్కడుందో తనతో వచ్చి చూపాలని కోరగా ఆ బాలిక గుడ్డిగా అతడిని నమ్మి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఈ క్రమంలో సాయికుమార్ ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. వెనువెంటనే ఆ బాలిక తేరుకుని, తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో యువకుడు ఆ బాలికను తీవ్రంగా గాయపర్చాడు. అయినా, శక్తిని కూడగట్టుకుని.. నిందితుడి చెర నుంచి ధైర్యంగా బయటపడింది.
విశాఖ వ్యాలీ స్కూల్ పక్కన ఉన్న రోడ్డుపైకి గాయాలతో వచ్చిన బాలిక పరిస్థితిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు సాయికుమార్‌గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారించగా, నిందితుడు ఓ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. బాలికపై అత్యాచారం జరగలేదని, లైంగిక దాడికి నిందితుడు యత్నించాడని తెలిపిన పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణను దిశ పోలీసు స్టేషన్‌కి అప్పగించినట్టు నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు. జరిగిన ఘటనను బాలిక తల్లిదండ్రులు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు వివరించారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బాలికను పరామర్శించేందుకు వెళుతుండగా విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలైన వారితో విశాఖ నగరంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. మనోధైర్యం నింపడానికి శాసనసభ్యుడిగా నేను, స్థానిక కార్పొరేటర్, బాలిక తల్లిదండ్రులు, బంధువులు వచ్చి బాలికను పలకరించాం. అసలు మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడకూడదు. అంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఎక్కడుంది?’ అని ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: