నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. వైరస్ కాటుతో తల్లి మృతి చెందగా.. అన్నా వదినలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రాజేశ్ అనే యువకుడు కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన రాజేశ్ ఆలనా పాలనా తల్లి చూసేది. కొవిడ్ బారినపడి అమ్మ చనిపోవడం, అన్నావదినలు ఆస్పత్రి పాలుకావడంతో మనస్తాపానికి గురైన రాజేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కరోనా భయంతో గ్రామస్థులు ఎవరూ దగ్గరకు రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్య ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపాాారు.