ETV Bharat / crime

నాలాలో మహిళ మృతదేహం.. హత్యాచారంగా అనుమానం.! - వికారాబాద్‌లో మహిళపై హత్యాచారం

కూలీ పనుల కోసం పట్ణణానికి వెళ్లిన మహిళ.. నాలాలో శవమై తేలింది. హత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

women murder
మహిళ హత్యాచారం
author img

By

Published : Feb 27, 2021, 6:59 AM IST

Updated : Feb 27, 2021, 11:48 AM IST

కూలీ పనుల కోసం పట్ణణానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఓ ఫాం హౌజ్ సమీపంలోని నాలాలో శవమై కనిపించింది. వికారాబాద్ జిల్లా ధరూరు మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ(40) అడ్డాకూలీ. గురువారం వికారాబాద్‌కు పనికి వెళ్లిన ఆమె.. రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీశారు. ఆమె కోసం గాలించారు. కానీ ఆచూకీ దొరకలేదు.

ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ద్వారా మృతురాలు ప్రయాణించిన ఆటోను గుర్తించిన పోలీసులు.. వాహన డ్రైవర్‌ను విచారణ చేశారు. ఆమె స్వగ్రామానికి దగ్గరలోనే దిగిందని డ్రైవర్‌ చెప్పడంతో సమీప ప్రాంతాల్లో గాలించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేట్‌పల్లి రైల్వే వంతెన వద్ద ఓ ఫాం హౌజ్ సమీపంలోని నాలాలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆ శవం అమృతమ్మదేనని కుటుంబ సభ్యుల సాయంతో గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీస్​స్టేషన్​కని వెళ్లింది.. అదృశ్యమైంది!​

Last Updated : Feb 27, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.