ETV Bharat / crime

బావిలో శవాలై తేలిన తల్లీకుమార్తె.. అసలేమైంది? - దామెర మండలం తాజా వార్తలు

A Woman Committed Suicide: ఓ మహిళ తన ఆరు నెలల పాపతో కలిసి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. నిమ్మల ఆమని, ఆమె ఎనిమిది నెలల పాపగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A woman committed suicide by jumping into a well

author img

By

Published : Nov 11, 2022, 10:31 AM IST

Updated : Nov 11, 2022, 2:57 PM IST

A Woman Committed Suicide: హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ఎనిమిది నెలల పాపతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు ఆత్మకూరు మండలం హౌజూబుజూర్గు గ్రామానికి చెందిన నిమ్మల మురళితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని చెప్పారు. వీరికి 8 నెలల పాప ఉందని తెలిపారు. చిన్నారికి జన్మించినప్పుడు ఆరోగ్యరీత్యా బాగాలేకపోవడంతో గత మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించారని పేర్కొన్నారు.

గురువారం పాపను ఆసుపత్రికి తీసుకు వెళ్తానని చెప్పిన ఆమని దామెర మండలం ఉరుగొండ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: వామ్మో గొలుసు దొంగ.. పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

మైనర్​పై రిక్షా డ్రైవర్ల గ్యాంగ్​రేప్​.. స్కూల్ ఫీజు కట్టలేదని వేధింపులు.. ఫ్యాన్​కు ఉరేసుకుని..

Last Updated : Nov 11, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.