wife killed husband: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ఎట్టకేలకు చావుబతుకుల నుంచి బయటపడ్డాడు. తన కుమార్తెలను చంపిన భర్త తనని కూడా చంపుతాడేమోనన్న భయంతో భార్య అతడిని హత్య చేసింది. కొల్లాపూర్ మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొల్లాపూర్ మండలం కుడికిల్లకు చెందిన ఓంకార్(39)కు మహేశ్వరి మూడో భార్య. ఆమెకు ఇది రెండో వివాహం. వీరిద్దరికి కుమార్తె చందన (3), కుమారుడు విశ్వనాథ్ (1) ఉన్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. ఆగస్టు 17న ఓంకార్ తన ఇద్దరు పిల్లలను కోడేరు మండలం ఎత్తం గుట్ట వద్ద గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ ఘటనలో మహేశ్వరి తప్పించుకొని పారిపోయింది.
హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో చికిత్స పొందిన ఓంకార్ ఈనెల 16న కుడికిల్లకు వచ్చాడు. బిడ్డలను చంపినవాడు తననూ చంపుతాడని భయపడిన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఓంకార్‌ను చంపేసింది. అనంతరం కొల్లాపూర్ ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
ఒకే గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య.. ఆ వ్యవహారమే కారణమా..?
అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం