ETV Bharat / crime

వాచ్​మెన్​పై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి - watchmen murder news

ఓ కంపెనీ వాచ్​మెన్​పై మరో కంపెనీ వాచ్​మెన్​ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

వాచ్​మెన్​పై కత్తితో దాడి..
వాచ్​మెన్​పై కత్తితో దాడి..
author img

By

Published : Apr 20, 2021, 1:23 AM IST

శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్​పహాడ్​లో దారుణ హత్య జరిగింది. ఓ కంపెనీ వాచ్​మెన్​పై మరో కంపెనీ వాచ్​మెన్​​ కత్తితో దాడి చేశాడు. ఘటనలో అమ్రాన్​ షా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమ్రాన్​ షా మృతి చెందాడు. మృతుడు బిహార్​ వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రాజేంద్రనగర్ బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.