Bike Thief arrest: అతని కన్ను పడిదంటే ద్విచక్ర వాహనం మాయమవుతుంది. కొట్టేయడం... అమ్మేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు ఏకంగా 111 బండ్లను కొట్టేసి.. అమ్మేశాడు. ఈ దొంగ గురించి ఆ నోటా ఈ నోటా వచ్చిన సమాచారంతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాలలో సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ టి.రఘునాథరావులు విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ... జగ్గంపేటలో నివాసం ఉంటున్నాడు. తణుకు, మండపేట, రాజమహేంద్రవరం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించి జగ్గంపేట మండలం గోవిందపురం, రాజపూడి, కృష్ణపురం, మన్యంవారిపాలెం, మల్లిశాల తదితర గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించేవాడు. గోవిందపురానికి చెందిన వ్యక్తి ఒకరు ఏకంగా 15 బైకులు కొని, సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
చోరీ వాహనాలను కొనుగోలు చేసిన వారికి పోలీసులు ఫోన్లు చేస్తుండటంతో ఒక్కొక్కరుగా వాటిని పోలీసుస్టేషన్‌కు తీసుకొస్తున్నారు. మరికొందరైతే బైకులను ఠాణా పరిసరాల్లో పెట్టేసి నెమ్మదిగా జారుకుంటున్నారు. వాహనాల చోరీ వ్యవహారంలో మరో నిందితుడు తెలంగాణలోని ఖమ్మం సబ్‌జైలులో వేరే నేరంలో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి :