ETV Bharat / crime

Teacher misbehave with Student : కీచక ఉపాధ్యాయుడు.. బాలికతో అసభ్య ప్రవర్తన - తెలంగాణ టాప్ న్యూస్

Teacher misbehave with Student : విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. నాలుగో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Teacher misbehave with Student , chatrinaka teacher incident
కీచక ఉపాధ్యాయుడు
author img

By

Published : Feb 6, 2022, 10:38 AM IST

Teacher misbehave with Student : ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలాని కథనం ప్రకారం.. ఫలక్‌నుమా భారత్‌కోటలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో అష్వాఖ్‌ అహ్మద్‌(35) ఉపాధ్యాయుడు. చాంద్రాయణగుట్టకు చెందిన బాలిక(10) అందులో నాలుగో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం బాలికను ఆమె తాత పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. ఉదయం 8.30 గంటల సమయంలో తరగతి గదిలో బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన అష్వాఖ్‌ అహ్మద్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

బాలిక విషయాన్ని సోదరుడికి చెప్పగా అతడు తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. తండ్రి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న బండ్లగూడ మండల ఉప విద్యాధికారి బాలూనాయక్‌ పాఠశాలను సందర్శించి... వివరాలు తెలుసుకున్నారు. భార్య వదిలివేయడంతో అష్వాఖ్‌ అహ్మద్‌ మానసికంగా కుంగిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని ఛత్రినాక పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.