Loan App Harassment: ఆన్‌లైన్ లోన్ యాప్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. అడగకుండానే రుణాలు ఇచ్చి.. అనంతరం గడువుకు ముందే తిరిగి చెల్లించాలని లేదంటే.. పరువు తీస్తామని వేధించడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగింది. ఇందుకు సంబంధించి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనబంధు కాలనీకి చెందిన రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కార్పెంటర్‌గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు తలెత్తటంతో లోన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నాడు. సమయానికి రుణం చెల్లించకపోవటంతో రుణయాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?
ఐపీఎస్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..