ETV Bharat / crime

మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు - Chandana Deepti news today

ఓ దుండగుడు ఓ మహిళపై పెట్రోల్​ లాంటి ద్రావణంతో దాడి చేశాడు. డబ్బుల గురించి చర్చించేందుకు వెళ్లినపుడు గొడవ జరిగి.. ఆ ద్రావణం ఆమెపై పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది.

a-person-attacked-the-woman-with-petrol-at-gadipeddapur-medak
మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు
author img

By

Published : Mar 9, 2021, 1:03 AM IST

Updated : Mar 9, 2021, 1:30 AM IST

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్‌లో ఓ మహిళపై పెట్రోల్​ లాంటి ద్రావణంతో దాడి జరిగింది. ఈ దాడి కేసులో ప్రధాన నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రకటించారు. ఆర్థిక లావాదేవీలే అందుకు కారణం అని ఆమె స్పష్టం చేశారు.

పశువుల వ్యాపారం చేసే సాదత్​తో ఆమెకు డబ్బు లావాదేవీలపై వివాదాలున్నాయి. రాత్రి డబ్బుల లావాదేవీల గురించి మాట్లాడేందుకు ఇద్దరూ వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెట్రోల్ వంటి ద్రావణం మహిళ ముఖంపై పోసి నిప్పంటించాడని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సాదత్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.

ఇదీ చూడండి : 'భైంసా అల్లర్లపై పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు'

Last Updated : Mar 9, 2021, 1:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.