హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని శ్రీరామనగర్ బస్తీలో విషాదం నెలకొంది. భర్తతో ఘర్షణ పడిన ఓ మహిళ తన 10 నెలల చిన్నారితో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. బిహార్‌కు చెందిన దంపతులు విమల్ కుమార్, ఆర్తి జీవనోపాది కోసం నగరానికి వచ్చి శ్రీరామ్‌నగర్ బస్తీలో నివాసముంటున్నారు.
విమల్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో 10 నెలల కుమార్తెను తీసుకుని భవనంపై నుంచి ఆర్తి దూకింది. వెంటనే వీరిద్దరిని ఆస్పత్రికి తరలించగా ఆర్తి మృతి చెందగా చిన్నారి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి: సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు.. భార్యను చంపించేశాడు!