ETV Bharat / crime

గంజాయికి బానిసైన కుమారుడు.. స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లిన తల్లి - Suryapet district news updates

పిల్లలు వ్యసనాలకు బానిసలైనా.. సరైన మార్గంలో నడవకపోయినా.. తల్లిదండ్రులను నిందించడం పరిపాటి.. పెంపకం రాదని ఎద్దేవా చేయడం సహజం.. అందుకే పిల్లలను దారిలో పెట్టేందుకు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవు.. అదే ప్రయత్నం చేశారు ఓ మాతృమూర్తి. గంజాయికి బానిసగా మారుతున్న కుమారుడిని దారిలో పెట్టేందుకు కన్నపేగు కాదన్న.. కఠినంగా శిక్షించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

A mother who beats her son who is addicted to marijuana in Kodada
గంజాయికి బానిసైన కుమారుడు
author img

By

Published : Apr 4, 2022, 1:50 PM IST

Updated : Apr 4, 2022, 6:38 PM IST

గంజాయికి బానిసైన కుమారుడు.. గట్టిగా బుద్ధి చెప్పిన తల్లి

పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా..? లేదా..? అనేది ముందుగా గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ల ప్రవర్తనలో ఏమైనా తేడాలు ఉంటే గుర్తించడం వ్యసనాలకు బానిస అవుతున్నాడా అనేది ప్రాథమిక స్థాయిలోనే నిర్ధరణకు వచ్చి అదుపు చేయగలిగాలి. ఏది మంచి.. ఏది చెడు.. చెప్పి సరిదిద్దాలి. తల్లిదండ్రులు కూడా ఎంతమేరకు వారి సంతానాన్ని దారిలో పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. 'పుడింగ్‌ అండ్‌ మింక్‌' పబ్‌ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. మావాడు మంచోడు, పబ్‌కు వెళ్తే తప్పేంటని కొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తప్పుదారిలో నడుస్తున్న పిల్లలను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, సూర్యాపేట జిల్లాలో మాత్రం ఓ తల్లి తన కుమారుడు మత్తుమందుకు బానిస అవుతున్నాడని తెలిసి కఠినంగా శిక్షించింది.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం గాంధీనగర్​కు చెందిన ఓ 15ఏళ్ల బాలుడు పాఠశాల బంద్​ చేసి.. మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. చెడు అలవాట్లు, చెడు స్నేహితుల కారణంగా గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. వ్యవనానికి గురైన బాలుడు.. తల్లి ఎంత చెప్పినా వినలేదు. కుమారుడు కళ్ల ముందే చెడిపోతున్నా... తల్లిదండ్రులు ఏమిచేయలేని పరిస్థితి. ప్రతిరోజు మత్తుతో ఇంటికి వచ్చిన కుమారుడికి మంచి మాటలు చెప్పిన ఎక్కకపోవడంతో.. ఆగ్రహించిన తల్లి... స్తంభానికి కట్టేసింది. కొడుకును ఎలాగైనా దారికి తేవాలని మత్తుపదార్థాలు మానాలని కన్నీళ్లు దిగమింగుతూ.. కళ్లలో కారం పోసి.. దేహశుద్ధి చేసింది. మత్తు పదార్థాలు మానేస్త అని కుమారుడు మాట ఇవ్వడంతో.. కన్న పేగు విడిచి పెట్టింది. కుమారుడికి చికిత్స అందించి.. స్నానం చేయించి.. గుండెలకు హత్తుకుందా తల్లి.

గంజాయికి బానిసైన బాలుడిని.. తల్లి శిక్షిస్తున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారాయి. కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు విధించిన దండనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కొంత మంది మాత్రం... బిడ్డకు నచ్చజెప్పుకోవాలి కాని... అంత కఠినంగా ప్రవర్తించకూడదని అంటున్నారు.

ఇటీవల యువత పెడధోరణి పడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మద్యం , గంజాయి, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఈ మత్తులో అసాంఘిక కార్యక్రమాలు, నేరాలకు పాల్పడుతున్నారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. డ్రగ్స్‌కు బానిసలైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. మామూలు మనుషులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరుగుతున్న ఘటనలు యువత మత్తుతో చిత్తై ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కలకలం రేపుతోంది. ఓ యువకుడు డ్రగ్స్‌ కోసం తరచూ గోవాకు వెళ్తూ చివరకు మత్తు మోతాదు ఎక్కువై బలైపోయాడు కూడా.

హైదరాబాద్‌లో రోజుకోచోట డ్రగ్స్‌ ముఠాలు పట్టుపడుతున్నాయి. గోవా, పంజాబ్‌ నుంచి మత్తుమందులు నగరానికొస్తున్నాయి. ఇంజినీరింగ్‌తోపాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాళ్లనే ఏజెంట్లుగా నియమించుకొని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. గంజాయి వాడకమైతే చెప్పనక్కర్లేదు.. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల నుంచి పెద్దమొత్తంలో రాష్ట్రానికి చేరుతోంది. కూరగాయలు, ఇతర వస్తువుల రవాణా ముసుగులో గంజాయి, హాశ్‌ ఆయిల్‌ తదితర మత్తుమందులను రాష్ట్రానికి గుట్టుగా చేరుస్తూ యువతను చిత్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కేటీఆర్, డీకే శివకుమార్​ మధ్య ట్విటర్​లో ఆసక్తికర చర్చ

Last Updated : Apr 4, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.