హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఇవాళ్టి నుంచి నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఇవాళ్టి నుంచి రూల్స్ మీరితే ఫైన్ తప్పదని హెచ్చరించారు. ఉదయం నుంచే కూడళ్లలో ఉండి రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్లు విధిస్తున్నారు. విధుల్లో భాగంగా అమీర్‌పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఇదే సమయంలో అక్కడ రాంగ్ రూట్లో వచ్చిన ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్‌ను ఆపి.. బండి తాళం తీసుకున్నారు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ తనను ఎందుకు ఆపారని వాగ్వాదానికి దిగాడు. తరువాత మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి పెట్రోల్‌తో వచ్చి.. తన బండిపై పోసి నిప్పంటించాడు. దీంతో బైక్ మంటల్లో కాలిపోయింది.
ఈ ఘటనపై అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులు ఫైర్ స్టేషన్‌కు కాల్ చేశారు. వారు వచ్చి మంటలు ఆర్పారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గానే తీసుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తమ విధులను అడ్డుకోవటం కింద అశోక్‌పై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: