ETV Bharat / crime

ARREST: గాయని పేరుతో నకిలీ ఖాతాలు.. వ్యక్తి అరెస్ట్ - తెలంగాణ వార్తలు

గాయని పేరిట సామాజిక మాధ్యమాల్లో(social media) నకిలీ ఖాతాలు(fake accounts) సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటకకు చెందిన నవీన్ అనే వ్యక్తి ఓ తెలుగు గాయని పేరిట ఖాతాలు సృష్టించి... లబ్ధి పొందేందుకు యత్నించాడని పేర్కొన్నారు. పైగా తన వ్యాపారానికి అభ్యంతరం చెప్పొద్దని ఆమెనే బెదిరించాడని వెల్లడించారు.

a man arrest due to create fake accounts, cyber crime in hyderabad
గాయని పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించిన వ్యక్తి అరెస్ట్, వ్యక్తిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
author img

By

Published : Jul 17, 2021, 7:01 PM IST

తెలుగు సినీ గాయని పేరుతో సామాజిక మాధ్యమాల్లో(social media) నకిలీ ఖాతాలు(fake accounts) తెరిచి లబ్ధి పొందేందుకు యత్నించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు(rachakonda cyber crime police) అరెస్ట్ చేశారు. కర్నాటకలోని అత్తిబెలి మండలం నారాలూరుకు చెందిన నవీన్ లఘు చిత్రాల డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఓ తెలుగు సినీ గాయని(telugu singer) ఇంటర్వ్యూని చూసి ఆమె అభిమానిగా మారాడు. అనంతరం ఆమె ఫొటోలు సేకరించి... గాయని పేరుతో ఫేస్ బుక్(facebook), ఇన్‌స్టా గ్రామ్(instagram), యూట్యూబ్ ఛానెల్(you tube), ట్విటర్‌(twitter) ఖాతాలు తెరిచాడు.

గాయనికి తెలియకుండా ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి, పలు వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్‌లు, పాటలు, లఘు చిత్రాల(short films)ను అప్ లోడ్ చేశాడు. ఓ చిత్రాన్ని నిర్మించేందుకు యత్నించగా... ఈ విషయం తెలుసుకున్న ఆ గాయని ఆ ఖాతాలను తొలగించాల్సిందిగా నవీన్‌ను కోరారు. కానీ అందుకు అతడు నిరాకరించాడు.

చివరకు గాయని రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఖాతాలు తొలగించేందుకు నవీన్ నిరాకరించి... పైగా తన వ్యాపారానికి అభ్యంతరం చెప్పొద్దని బెదిరించాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఐపీ అడ్రస్ ఆధారంగా నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.