ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సొంత అన్నచేతిలో దాడికి గురైన శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
అల్వాల్ ఠాణా పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి ఇంట్లో వారితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం అతడు తన తల్లితో వాదిస్తుండగా తమ్ముడు శ్రీకాంత్ అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన భాస్కర్ అతడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన సోదరున్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించిన నిందితుడు.. అత్యవసర విభాగంలో చేర్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ బాధితుడు గురువారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. 108కి సమాచారం ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. మృతుని సోదరుడే దాడి చేసినట్లు గ్రహించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఒక్క కాల్‌తో సాయం.. ఆరేళ్లలో లక్షల మంది వినియోగం