ETV Bharat / crime

వ్యక్తిపై కత్తిలో దాడికి దిగిన తండ్రి కొడుకులు - కరీంనగర్​లో ఓ వ్యక్తిపై ప్రత్యర్థి వర్గం కత్రితో దాడి

కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై తండ్రికొడుకులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A man was attacked by a rival group with knives in karimnagar
ఓ వ్యక్తిపై కత్తిలో దాడికి దిగిన తండ్రి కొడుకులు
author img

By

Published : Feb 21, 2021, 10:36 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లికి చెందిన సూరం తిరుపతి రెడ్డి, అతని కుమారులు జనగాం సంపత్​ రెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితుడి మెడకు తీవ్ర గాయమైంది.

పర్లపల్లి గ్రామానికి చెందిన జనగాం సంపత్ రెడ్డి పొదుపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సూరం తిరుపతిరెడ్డి అతన్ని దుర్భాషలాడాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. విషయం తెలుసుకున్న తిరుపతి రెడ్డి కుమారులు నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని సంపత్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సంపత్​ రెడ్డి మెడకు తీవ్ర గాయం కాగా గమనించిన స్థానికులు అతన్ని కరీంనగర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.