ETV Bharat / crime

అంబేడ్కర్ మైదానం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం - తెలంగాణ వార్తలు

బొల్లారం పోలీసు స్టేషన్​ పరిధిలో వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందారు. మృతుడిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

a-man-suspected-death-at-ambedkar-maidan-bollaram-in-hyderabad-district
అంబేడ్కర్ మైదానం వద్ద గుర్తు తెలియని మృతదేహం
author img

By

Published : Feb 8, 2021, 9:13 PM IST

హైదరాబాద్​​ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అంబేడ్కర్ మైదానం వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. మృతుడి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.

ఎక్కువ మద్యం సేవించడం వల్లనా? లేక అనారోగ్య కారణాలతో మృతి చెందాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు బొల్లారం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.