ETV Bharat / crime

పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా

మంచి చదువు చదివి.. హైదరాబాద్​లోని ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా చేరిన ఓ వ్యక్తి ఆన్​లైన్ పేకాటకు అలవాటు పడ్డాడు. అది కాస్తా వ్యసనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్రైవేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలో చేరి అక్కడ 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి... చివరికి కటకటాల పాలయ్యాడు.

Poker game addiction, 50 lakhs theft at Hyderabad
పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా
author img

By

Published : Apr 9, 2021, 9:18 AM IST

ఆన్​లైన్​ పేకాట వ్యసనంగా మారడం వల్ల ఓ వ్యక్తి ఉద్యోగం పోయింది. అంతేకాదు మరో ప్రైవేటు కంపెనీలో చేరిన అతను 50 లక్షలు తీసుకుని ఉడాయించి... చివరకు కటకటాల పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళంకు చెందిన నవీన్ బెంగళూర్​లో బ్యాంకింగ్ సేవల్లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా చేరాడు. ఈ క్రమంలో ఆన్​లైన్​లో పేకాటకు బానిసై అప్పుల పాలయ్యాడు. చివరికి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాడు. 2020 జూన్​లో పెద్ద అంబర్​పేట్​లో ఉన్న జేబీ ఇన్​ఫ్రా స్థిరాస్తి సంస్థలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్​గా చేరాడు.

ఈ నేపథ్యంలో కంపెనీ మేనేజర్ ఓ రోజు నవీన్​కు 50 లక్షల రూపాయలు ఇచ్చి మరుసటి రోజు బ్యాంకులో జమ చేయాలని సూచించాడు. 50 లక్షలు తనతో తీసుకెళ్లిన నవీన్​కు దురాలోచన పుట్టింది. తన వద్ద ఉన్న డబ్బుతో ఆన్​లైన్​లో పేకాట ఆడి ఒకే రోజు 12 లక్షలకు పైగా నష్టపోయాడు. మరుసటి రోజు కంపెనీ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చినా స్పందించలేదు. వెంటనే తన వద్ద మిగిలి ఉన్న డబ్బులను తీసుకుని పలాసకు వెళ్లాడు. అక్కడ తన మామ రామకృష్ణకు రూ.5 లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులను తీసుకుని మరొక బంధువు అమిత్ రెడ్డితో కలిసి కోల్​కతా వెళ్లి జల్సా చేశాడు. జేబీ ఇన్ ఫ్రా సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి రూ.28.7 లక్షల నగదు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి : టీకా ఇస్తామంటూ... బంగారం ఎత్తుకెళ్లారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.